Friday, November 22, 2024

దిగ్విజయ్ ‌సింగ్‌కు షాక్.. నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం నేత అన్వర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2016లో ఎంఐఎంపై దిగ్విజయ్‌సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు సోమవారం విచారించింది. విచారణ సమయంలో కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు నివ్వాలని దిగ్విజయ్‌సింగ్ కోరారు. ఆనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. దిగ్విజయ్ సింగ్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 8వ తేదీకి ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఇతర రాష్ట్రాల్లో డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేస్తోందని దిగ్విజయ్‌సింగ్ చేసిన విమర్శలపై ఎంఐఎం నేత పరువు నష్టం దావా దాఖలు చేశారు.

Non-bailable warrant issued against Digvijay Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News