Sunday, December 22, 2024

సాoప్రదాయేతర ఇంధన వనరుల రంగాన్ని ప్రొత్సహించాలి : శాంతి కుమారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగాన్ని ప్రొత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. శనివారo రాష్ట్ర సచివాలయంలో ఈ మేరకు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రవాణాశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, టిఎస్ రెడ్కో ఎండి జానయ్య, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో కర్బన ఉద్గార తీవ్రత తగ్గింపు, సాంప్రదాయేతర ఇంధన శక్తి రంగాన్ని ప్రొత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం సంచిత సామర్థ్యం 6335 మెగావాట్లుగా ఉందని ఆమె తెలిపారు. ఇంధన మిశ్రమంలో పునరుత్పాదకాలను అవలంబిస్తున్న రాష్ట్రాలలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. 2023 లో పునరుత్పాదక ఇంధన స్వీకరణ 9.8 శాతంగా ఉందని ఈ ఆర్థిక సంవత్సరంలో 14.1శాతానికి పెరిగిందన్నారు. వ్యవస్థాపక సామర్థ్యం పరంగా పునరుత్పాదక శక్తి వాటా దాదాపు 25 శాతం ఉందని ఇంధన పొదుపు చర్యలను అవలంబించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, ఈ రంగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం అని సిఎస్ పేర్కొన్నారు.

ఈవి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం టిఎస్ రెడ్కో కు భూములు అందించడానికి గ్రామం, మండలాల వారీగా స్థలాలను గుర్తించి నిర్దిష్ట ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని టిఎస్ రెడ్కోను సిఎస్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సోలార్ పాలసీ 2015- ప్రమోషనల్ ప్రయోజనాలతో 2015లో జారీ చేయబడిందని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఈ సందర్భంగా తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌లను టిఎస్ రెడ్కో ద్వారా తప్పనిసరిగా అమర్చాలని అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా, నివాస గృహాలకు సోలార్ రూఫ్ టాప్‌ను తప్పనిసరి చేయడానికి సూచనలు జారీ చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News