Monday, December 23, 2024

కేంద్ర ఉద్యోగుల డిఎ 4 శాతం పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వోద్యోగుల డిఎలో 4 శాతం పెంపుదల, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ నిర్ణయాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువరించారు. కేంద్ర ఉద్యోగులకు కరవు భత్యాన్ని ఇప్పుడున్న 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు. జులై 1వ తేదీ నుంచి ఈ పెంపుదల అమలులోకి వస్తుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రి మండలి ఈ డిఎ పెరుగుదల నిర్ణయం తీసుకుంది. పెంపుదల దేశంలోని 48.67 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా ఇచ్చే ఉత్పతాదకత ఆధారిత బోనన్‌ను (పిఎల్‌బి) కూడా కేంద్రం ప్రకటించింది.

దీని మేరకు 202223 సంవత్సరానికి 78రోజులకు సమానమైన వేతనాన్ని రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా చెల్లిస్తారు. ఆర్‌పిఎఫ్ సిబ్బంది మినహా ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైయిన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నిషియన్లు వంటి అర్హులైన దాదాపు 11 లక్షల నాన్‌గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఈ బోనస్ చెల్లింపు ఖర్చు నూ 1968.87 కోట్లుగా అంచనావేశారు. 202223లో రైల్వేల పనితీరు చాలా బాగుందని, రవాణా కార్యకలాపాలు సత్ఫలితాలు ఇచ్చాయని ప్రభుత్వం తెలిపింది. రైల్వేలు ఈ ఏడాది దశలో 1509 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా, దాదాపు 650 కోట్ల మంది ప్రయాణికుల చేరవేత రికార్డుకు చేరుకుందని అధికార ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News