Monday, December 23, 2024

జమ్మూకశ్మీర్ లో ఓటేసేందుకు స్థానికేతరులకు అనుమతి!

- Advertisement -
- Advertisement -

 

Non-local voters in J&K

శ్రీనగర్:  జమ్మూకశ్మీర్‌లో తదుపరి ఎన్నికల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉంది.  స్థానికేతరులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ ,  ఒమర్ అబ్దుల్లా ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇది “ప్రమాదకరమైన ప్రయత్నం” అని అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్‌లో నాలుగేళ్లకు పైగా ఎన్నికైన ప్రభుత్వం లేకుండా పోయింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.2019లో ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసిన తర్వాత, కశ్మీరేతరులు ఓటు వేయడానికి , భూమిని సొంతం చేసుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత మొదటిసారిగా స్థానికేతరులు జమ్మూ కశ్మీర్‌లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణను అనుమతించారు.

జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హిర్దేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 76 లక్షల మంది ఓటర్లకు అదనంగా మూడో వంతు కంటే ఎక్కువ ఓటర్ల సంఖ్య పెరగవచ్చు. “370 ఆర్టికల్ ను  రద్దు చేసిన తర్వాత, అంతకుముందు ఓటు వేయలేని వారు ఇప్పుడు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. తుది జాబితాలో (20-25 లక్షల) కొత్త ఓటర్లు అదనంగా ఉంటారని మేము ఆశిస్తున్నాము,” అని హిర్దేష్ కుమార్ తెలిపారు.భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వలే  జమ్మూకశ్మీర్‌లో నివసిస్తున్న లేదా పని చేసే ఎవరైనా అక్కడ ఓటు వేయవచ్చని ఆయన సూచించారు. కాగా ఈ చర్యపై జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో మద్దతు విషయంలో బిజెపి యొక్క “అభద్రతాభావం” కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. “జమ్మూకశ్మీర్   అసలైన ఓటర్ల నుండి  బీజేపీకి అంత అభద్రత ఉందా, సీట్లు గెలవడానికి తాత్కాలిక ఓటర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా? జమ్మూకశ్మీర్ ప్రజలు తమ ఓటు హక్కును  వినియోగించుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఇవేవీ బిజెపికి సహాయపడవు” అని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాశారు. ఇదిలావుండగా ‘ బిజెపి 25 లక్షల ఓటర్లను దొడ్డిదారిలో తేవాలనుకుంటోంది’ అని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. ఆమె బిజెపి పాలసీలను విమర్శిస్తూ నాజీ జర్మనీ, పలస్తీనాలను ఉదాహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News