Monday, December 23, 2024

రాజకీయాలకతీతంగా గడగడపకు సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -
  • కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దు.. అండగా నేనుంటా
  • ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

మునిపల్లి: రాజకీయాలకతీతంగా ప్రతి గడగపడకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఈసందర్భంగా వట్‌పల్లి మండలం పోతులబొగుడ గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునిపల్లి మండలంలోని మేళసంగం, పెద్దలోడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లోచేరారు. బిఆర్‌ఎస్‌లోచేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధ ంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్ర తి గడపకు బిఆర్‌ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలుచేరుతున్నాయన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు.

అలాగే బిఆర్‌ఎస్‌లో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని, ఏ కష్టం వచ్చినా.. తాను అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, పార్టీ సీనియర్ నాయకుడు చిట్కుల వెంకటేశం, మైనార్టీ నాయకుడు కుతుబోద్దీన్, నాయకులు పెద్దలోడి రాజు, ప్రేమ్‌నందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News