Monday, December 23, 2024

అహింసే గాంధీ ఆయుధం: బండి సంజయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: అహింసే తన ఆయుధంగా… సత్యమే తన శక్తిగా.. చేతిలో భగవద్గీతతో దేశానికి ఊతకర్రయై నిలిచి… ఆంగ్లేయులను ఎదిరించి, భారతమాత సంకెళ్లను తెంచిన జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని ఎంపి కార్యాలయంలో ఆ మహానీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళిలర్పించారు. ఈ సందర్బంగా వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని పరిచయం చేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని ప్రశంసించారు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం స్వదేశీ నినాదం వంటి ఉద్యమాలతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అని మెచ్చుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పదవులనే త్యాగం చేసిన నిజాయితిపరుడు దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ అని స్మరించుకున్నారు. ఆ మహానీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News