Monday, December 23, 2024

అహింసాయుత ఉద్యమం అత్యంత కఠినమైనది: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Non-violent movement is the toughest

నల్లగొండ: స్వాతంత్ర్య స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను నిర్వహించ తలపెట్టిందని ఆయన వివరించారు. బారిస్టార్ విద్య కోసం దక్షిణ ఆఫ్రికాకు చేరుకున్న మహాత్మాగాంధీకి స్వాతంత్ర్య ఉద్యమ అవసరం స్ఫురించిందన్నారు. అటువంటి స్పూర్తితో మాతృభూమికి చేరుకోగానే నాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశానికి స్వాతంత్య్రం కోసం మొదలు పెట్టిన ఉద్యమ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని ఆయన తెలిపారు.

ఈ నెల 8 నుండి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలలో భాగంగా మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన మున్సిపాలిటీ ప్రత్యేక పాలక మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు యన్. బాస్కర్ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, యస్ పి రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఎంచుకున్న మార్గం అహింసాయుత ఉద్యమం అని అన్నింటికి మించిన కఠినమైన ఉద్యమం ఏదైనా ఉందీ అంటే అది అహింసాయుత ఉద్యమం మాత్రమేనన్నారు.

అటువంటి ఉద్యమ తాలూకు స్ఫూర్తిని వర్తమానానికి అందించాలి అన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమన్నారు. అటువంటి గొప్ప ఉద్యమంలో పాల్గొని మనకు స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన మహాత్మా గాంధీతో సహా నాటి సనరయోధుల వీర గాథలను ప్రతి ఒక్కరికీ వివరించాలని ఆయన కోరారు. అటువంటి అమరుల స్ఫూర్తిని గుర్తు చెయ్యడంలో భాగంగానే జాతీయ పతకాలు పంపిణీ అని, అది అందుకున్న వారు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో సహా కౌన్సిలర్లకు జాతీయ పతాకాలు అందజేశారు. ఇంటింటికి తిరుగుతూ ఇదిలా ఉండగా స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహాం వేడుకలను పురస్కరించుకుని నల్లగొండ పురపాలక సంఘం పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ జాతీయ పతాకాలను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి వెంట స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణా చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News