- Advertisement -
వరుసగా స్పెషల్ నంబర్లతో పాపులరైన నోరా ఫతేహి.. శిష్యుల జాబితాలో లోఫర్ బ్యూటీ దిశా చేరింది. డ్యాన్స్ ల విషయంలో దిశ పటానీకి నోరా ఫతేహి మాత్రం ఓ టీచర్‌లా కనిపిస్త్తోందట. నోరా తనకన్నా గొప్ప డ్యాన్సర్ అని… ఆమె దగ్గర నుంచి ఎన్నో డ్యాన్స్ మూవ్‌మెంట్స్… సిగ్నేచర్ స్టెప్పులు నేర్చుకున్నట్లు దిశా తెలిపింది. “ఇద్దరం స్నేహితులం కావచ్చు..ఒకరి గురించి ఒకరు చెప్పుకోవచ్చు. కానీ నాకు మాత్రం ‘డ్యాన్సు గురూ’ నోరా” అంటూ ఆమెకి ప్రత్యేకమైన స్థానాన్ని కట్టబెట్టింది దిశా పటానీ. హాట్ హాట్ ఫోజుల్లో సైతం నోరాని అప్పుడప్పుడు అనుకరిస్తానని తెలిపింది. మొత్తానికి నోరాకి దిశా ఇచ్చిన స్థానం మాత్రం గొప్పదే. ఇక దిశా నటించిన ‘రాధే’ ఈనెల 14న రిలీజవుతోంది.
- Advertisement -