- Advertisement -
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుణ్ తేజ్ కు ఇది 14వ సినిమా. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నోరా ఫతేహి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుంది. ఈ మూవీ పూజా కార్యక్రమం ఈ రోజు(గురువారం) జరగనుంది. కాగా, ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -