Wednesday, January 22, 2025

సి-డాక్ తో నార్డెన్ కమ్యూనికేషన్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భద్రతా అవసరాలు, ఇతర పారిశ్రామిక వినియోగాల కోసం AI- ఆధారిత సాధారణ ప్రయోజన థర్మల్ కెమెరాలను అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్)తో ఒప్పందం చేసుకున్నట్లు నార్డెన్ కమ్యూనికేషన్ వెల్లడించింది. యుకె ఆధారిత నార్డెన్ కమ్యూనికేషన్ సంస్థ ఉత్పత్తి శ్రేణిలో నార్డెన్ కేబులింగ్ సిస్టమ్, నార్డెన్ సర్వైలెన్స్ సిస్టమ్, నార్డెన్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, నార్డెన్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్, నార్డెన్ యుపిఎస్ సిస్టమ్స్ ఉన్నాయి.

నార్డెన్ కమ్యూనికేషన్ ‘జనరల్ పర్పస్ థర్మల్ కెమెరా’ అభివృద్ధి కోసం ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ (ToT) ఆధారిత ప్రత్యేకమైన భాగస్వామ్యంలోకి ప్రవేశించింది.”ఈ భాగస్వామ్యం మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంలో భాగంగా జాతీయ భద్రత పట్ల అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. నిఘా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఒక అవకాశంగా నిలుస్తుంది” అని నార్డెన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ – ఇండియా, సార్క్ ప్రశాంత్ ఒబెరాయ్ అన్నారు.

ఎక్స్ట్రా – లో వోల్టేజ్ (ELV) సొల్యూషన్‌ల తయారీ, పంపిణీలో నైపుణ్యం కలిగిన నార్డెన్, నిఘా సాంకేతికత రంగంలో సి-డాక్ యొక్క లక్ష్యంకు అనుగుణంగా పనిచేస్తుంది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ(TOT) భాగస్వామిగా, నేషనల్ హైవే, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లలో జనరల్-పర్పస్ థర్మల్ కెమెరా ఉత్పత్తి, మార్కెటింగ్, విక్రయం, అమలుకు నార్డెన్ కట్టుబడి ఉంది. ఈ రంగంలో ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 30% ఉత్పత్తిని ఆశిస్తున్నారు. సి-డాక్ తో నార్డెన్ కమ్యూనికేషన్ భాగస్వామ్యం థర్మల్ కెమెరాల ఉత్పత్తిలో ఒక అద్భుతమైన ముందడుగును సూచిస్తుంది, ఇది జాతీయ భద్రత పట్ల నిబద్ధతను నొక్కి చెబుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News