Sunday, December 22, 2024

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన నార్మల్ భాస్కర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ సీనియర్ నేత, సామాజిక వేత్త నార్మల్ భాస్కర్ సోమవారం నాడు హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో తాను విస్తృత స్థాయిలో తిరిగి పార్టీ విజయం కోసం ప్రచారం చేశానని, అప్పట్లో అధికారంలోకి వస్తే తనకు సముచిత ప్రాధన్యతనిస్తామని పిసిసి చీఫ్, ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి సహా మీరు తనకు హామీ ఇచ్చారని అందుకు అనుగుణంగా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో తనకు అవకాశం కల్పించాలని నార్మల్ భాస్కర్ మంత్రిని కోరారు.

ఇందుకు మంత్రి భట్టి స్పందిస్తూ నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసిన వారిని తీసుకుంటామని, ఇందుకు తనవంతుగా తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను కూడా నార్మల్ భాస్కర్ కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియసినట్లు తెలిపారు.

Normal Bhaskar 2

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News