Monday, December 23, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని మండల వైద్యాధికారిని డాక్టర్ ఆస్మా అఫ్షీన్ అన్నారు. గురువారం ఎంపిపి గైని అనసూయ రమేష్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా డా అఫ్షీన్ ఆసుపత్రిలో కల్పించే సౌకర్యాల గురించి వివరించారు. సదాశివనగర్ గ్రామానికి చెందిన మహిళ పిహెచ్‌సీలో సాధారణ ప్రసవం చేయించుకోగా ఆమెతో ఎంపిపి మాట్లాడారు.

ఆసుపత్రి లో లభించిన సేవలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు లభిచడంతో ఒపి పేషెంట్ల సంఖ్య పెరిగిందని తె లిపారు. కార్యక్రమంలో సిహెచ్‌వో నాగరాజు, ఆయుష్ డాక్టర్ నాహెద తరన్నున్, హోమియో వైద్యులు భువన, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News