తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ జిల్లాలో నోరోవైరస్ ఉన్నట్లు ధృవీకృతమైంది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ప్రధానంగా కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నివారించవచ్చు. ఇదో అత్యంత అంటు వ్యాధి. వాయనాడ్ జిల్లాలోని వైథిరీ సమీపంలోని పూకొడేలోని వెటర్నరీ కాలేజ్‌లో13 కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు ఇది సోకింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదంలేదు. ఈ వివరాలను కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. ఆమె ప్రజలను ఈ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. చికిత్స ద్వారా ఈ వ్యాధిని శీఘ్రంగానే అరికట్టవచ్చని అన్నారు. నోరోవైరస్ ఉదరకోశ వ్యాధిని కలిగిస్తుంది. దానివల్ల కడుపు ప్రేగుల లైనింగ్‌లో మంట, కడుపు నొప్పి, తీవ్ర వాంతులు, విరేచనాలు, తలతిరగడం, శారీరక నొప్పులు, శారీరక ఉష్ణోగ్రత పెరగడం వంటివి కలుగుతాయి. ఆరోగ్యంతో ఉన్న వారిని నోరోవైరస్ పెద్దగా బాధించదు. కాకపోతే బాలలు, వృద్ధులలో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. క్లోజ్ కాంటాక్ట్‌లు కలిగి ఉన్న వారిమధ్య ఇది వేగంగా వ్యాపిస్తుంది. స్టమక్ బగ్ ఉన్న వారు వండింది తిన్నా ఈ వ్యాధి అంటుకుంటుంది. పండ్లు, కూరగాయలు వంటివి బాగా కడిగి తినాల్సి ఉంటుంది. పాచిపోయిన ఆహారం వంటివి తీసుకోకూడదు.
కేరళలో నోరోవైరస్!
- Advertisement -
- Advertisement -
- Advertisement -