Sunday, January 19, 2025

ఉత్తర, దక్షిణ కొరియాల విలీనం జరగదు: కిమ్

- Advertisement -
- Advertisement -

ఉత్తర, దక్షిణ కొరియాల విలీనం జరిగే పని కాదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాతో సయోధ్య జరిపేందుకు ఇకపై ఎలాంటి ప్రయత్నాలూ జరగబోవని ఆయన ప్రకటించారు. తమ జోలికి వస్తే అమెరికా రాజధాని వాషింగ్టన్ ను, దక్షిణ కొరియా రాజధాని సియోల్ ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తామని హెచ్చరించారు.
కిమ్ కమాండర్ల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా, దక్షిణ కొరియాలు తమతో యుద్ధానికి దిగితే అణ్వాయుధాలు వాడేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నవారితో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News