Monday, January 20, 2025

పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: బిహార్‌లోని బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి ఢిల్లీ-కమఖ్యా నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రాత్రి 10.30 గంటలకు పట్టాలు తప్పడంతో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు మృతి చెందగా వంద మంది గాయపడ్డారు. డిఆర్‌ఎఫ్, రెస్యూ సిబ్బంది, రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడారు. క్షతగాత్రులను బ్రహ్మపూర్, పాట్నా, బక్సర్ లో వివిధ ఆస్పత్రులకు తరలించామని స్థానిక ఎస్ పి ప్రమోద్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News