Sunday, November 24, 2024

తీరు మారని ఉత్తర కొరియా

- Advertisement -
- Advertisement -

ఉత్తర కొరియా సోమవారం ఉదయం తన తూర్పు సముద్ర జలాల దిశగా పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని పొరుగు దేశాలు ఆరోపించాయి. దక్షిణ కొరియా, యుఎస్ సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన కొన్ని రోజులకు ఉత్తర కొరియా ఈ పరీక్షలకు ఉపక్రమించడం గమనార్హం. ఆ రెందు డేశాల సైనిక విన్యాసాలను దురాక్రమణకు రిహార్సల్‌గా ఉత్తర కొరియా ఆరోపించింది. దాదాపు ఒక నెలలో ఉత్తర కొరియా మొదటి సారిగా క్షిపణి పరీక్ష విన్యాసాలు జరిపింది. భావి దౌత్యంలో తమకు సానుకూలతను పెంచుకునేందుకు నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను, యుద్ధం తరహా యత్నాలను ముమ్మరం చేయగలదని బాహ్య విశ్లేషకులు ఇంతకుముందు జోస్యం చెప్పారు. ఉత్తర కొరియా సోమవారం ఉదయం 7.44కు రెండింటిని, 37 నిమిషాల తరువాత మరొకదానిని మొత్తం మూడు క్షిపణులను ప్రయోగించిందని జపాన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాలలో ఉత్తర కొరియా క్షిపణులు పడినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పార్లమెంటరీ సమావేశంలో తెలియజేశారు. అవి జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలం వెలుపల పడ్డాయని, ఎటువంటి నష్టమూ జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు. ఉత్తర కొరియా పదే పదే జరుపుతున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను ‘జపాన్, ప్రాంతం, అంతర్జాతీయ సమాజం శాంతి, భద్రతకు ముప్పు కలిగించే’ చర్యలుగా కిషిదా ఖండించారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష కార్యకలాపాలకు జపాన్ తీవ్ర నిరసన తెలియజేసిందని ఆయన చెప్పారు. ఎటువంటి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు జరపకుండా ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను అవి ఉల్లంఘించాయని కిషిదా ఆరోపించారు.

సోమవారం ఉదయం ఉత్తర కొరియా సాగించిన పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు తమ దృష్టికి కూడా వచ్చాయని దక్షిణ కొరియా సైన్యం తెలియజేసింది. జపాన్, దక్షిణ కొరియా మదింపుల ప్రకారం, ఉత్తర కొరియా రాజధాని ప్రాంతం నుంచి ప్రయోగించిన క్షిపణులు గంటకు 50 కిమీ గరిష్ఠ వేగంతో 300, 350 కిలో మీటర్ల దూరం ప్రయాణించాయి. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఆ క్షిపణి పరీక్షలను ఖండించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News