- Advertisement -
సియోల్ : ఉత్తర కొరియా బుధవారం బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్టు దక్షిణ కొరియా తెలిపింది. తూర్పు తీరం దిశగా ఆ ప్రయోగం జరిగినట్టు సౌత్ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌కు సమీపంలో ఉన్న సునన్ నుంచి ఈ మిసైల్ పరీక్ష జరిగింది. ఏప్రిల్ 25న జరిగిన మిలిటరీ పరేడ్ తర్వాత జరిగిన తొలి క్షిపణి పరీక్ష ఇది. అణ్వాయుధాలను మరింత వేగంగా సేకరించనున్నట్టు ఆ పరేడ్ సమయంలో కిమ్‌జోంగ్ ఉన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టు బుధవారం క్షిపణి పరీక్ష సాగింది. జపాన్ కూడా ఈ పరీక్షను ధ్రువీకరించింది. ఈ ఏడాది మిస్సైల్ పరీక్ష జరగడం ఇది 14 వ సారి. అయితే మార్చి 16న జరిగిన పరీక్ష విఫలమైనట్టు తెలుస్తోంది.
- Advertisement -