Monday, January 20, 2025

ఉత్తర కొరియా క్రూజ్ క్షిపణుల ప్రయోగం

- Advertisement -
- Advertisement -

సియోల్ : ఉత్తర కొరియా ఆదివారం ఉదయం మరోసారి తూర్పు తీరం దిశగా పలు క్రూజ్ క్షిపణులు ప్రయోగించినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలియజేసింది. ఇవి తమదేశం లోని ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్లినట్టు పేర్కొంది. అమెరికా నిఘా విభాగం దీన్ని ధ్రువీకరించింది. అయితే ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనే సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. వారం రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా రెండో కవ్వింపు చర్యగా పేర్కొంటున్నారు.

గత వారం కిమ్‌జోంగ్ ఉన్ ప్రభుత్వం ఒక వ్యూహాత్మక క్రూజ్ క్షిపణిని పరీక్షించింది. దానికి అణ్వాయుధ సామర్ధం ఉందని పేర్కొంది. గతవారం తమ సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని ఉత్తర కొరియా ఖండించింది. వాటికి ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు ఆదివారం ఆ దేశ మీడియా సంస్థ కెసీఎన్‌ఏ తెలియజేసింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే క్షిపణి ప్రయోగాలు జరిపినట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News