Monday, November 18, 2024

ఉత్తర కొరియా మరో కొత్త ఆయుధ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

North Korea tests new weapon

సియోల్ : ఉత్తర కొరియా మరో కొత్త రకం వ్యూహాత్మక చోదక ఆయుధాన్ని పరీక్షించింది. అణ్వాయుధ సామర్థం మరింత పెంచుకునేలా దీన్ని రూపొందించినట్టు ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం వెల్లడించింది. సైన్య ప్రదర్శన లేకుండా భారీ ఎత్తున వార్షిక వేడుకలు జరిగిన కొన్నాళ్లకు ఈ ప్రయోగం జరిగినట్టు వివరించింది. ఈ ఏడాది ఉత్తరకొరియా 13 సార్లు క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ యున్, ఇతర అగ్రస్థాయి అధికారులు ఈ ప్రయోగాన్ని వీక్షించారని కొరియా అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈవిధమైన ఆయుధ పరీక్ష ఉత్తరకొరియా భారీ ఎత్తున అణ్వాయుధాలను విస్తరించుకుంటుందనడానికి సంకేతంగా పేర్కొంది. ఈ కొత్త ఆయుధం యుద్ధంలో న్యూక్లియర్ వార్ హెడ్‌కు వాహక చోదకంగా పనిచేస్తుందని వ్యూహాత్మక లక్షాలను ఛేధిస్తుందని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News