Friday, November 22, 2024

అణ్వాయుధాలు విస్తరిస్తామని ఉత్తర కొరియా హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

సియోల్ :ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ అణ్వాయుధాలను మరింత విస్తరించడంతోపాటు మరింత అభివృద్ధికి ముందుకెళ్తామని హెచ్చరించారు. అమెరికాతో తమ భవిష్య సంబంధాలు ఆ దేశ శత్రువిధానాన్ని విడిచిపెట్టడంపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడుగా బైడెన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం కిమ్ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఐదేళ్ల తరువాత జరుగుతున్న అధికార వర్కర్స్ పార్టీ సమావేశంలో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు అధికారిక మీడియా కెసిఎన్‌ఎ పేర్కొంది.

బలమైన అత్యంత ఆధునిక ఆయుధాల్ని, నిఘా ఉపగ్రహాలను, అణు జలాంతర్గాములను, నీటిలో ప్రయోగించగల క్షిపణులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తాము స్థిరంగా జాతీయ రక్షణను నిర్మించి అమెరికా సైనిక బెదిరింపులను అణచివేస్తేనే కానీ కొరియా ద్వీపంలో శాంతి, పురోగతి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. శ్వేత సౌధంలో ఎవరున్నా ఉత్తర కొరియాపై అమెరికా విధానం మారదని కిమ్ అభిప్రాయపడ్డారు.ట్రంప్ హయాంలో అనేక సార్లు ట్రంప్‌తో కిమ్ భేటీ అయినప్పటికీ రెండు దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదు.

North Korea threatened to Expand Nuclear Weapons

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News