Monday, November 18, 2024

మిలిటరీ అణ్వస్త్ర బలం ‘అపరిమితంగా’ పెంపు

- Advertisement -
- Advertisement -

ఉత్తర కొరియా నియంత కిమ్ మళ్లీ పిలుపు
సియోల్ : అమెరికా నేతృత్వంలో వస్తున్న బెదరింపులను ఎదుర్కొనడానికి తన మిలిటరీ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ‘అపరిమితం’గా విస్తరించాలన్న తన పిలుపును ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పునరుద్ఘాటించినట్లు సోమవారం తెలియవచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి వాషింగ్టన్‌పై కిమ్ తొలిసారిగా ప్రత్యక్షంగా విమర్శలు సంధించారు. దక్షిణ కొరియాతో అమెరికా తన అణ్వస్త్ర ప్రతిఘటన వ్యూహాలను పెంచుతున్నందుకు, జపాన్‌తో కూడి మూడు విధాల సైనిక సహకారాన్ని పటిష్ఠం చేస్తున్నందుకు కిమ్ శుక్రవారం సైనిక అధికారులతో సమావేశంలో యుఎస్‌ను ఆక్షేపించారు.

ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్న, అస్థిరతను సృష్టిస్తున్న ‘ఆసిన్ నాటో’గా ఆ సహకారాన్ని కిమ్ అభివర్ణించారు. సుదీర్ఘంగా సాగుతున్న రష్యన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నందుకు కూడా అమెరికాను కిమ్ విమర్శించారు. మాస్కోపై పోరు సాగించేందుకు తమ ‘షాక్ దళాలు’గా వాషింగ్టన్, దాని పాశ్చాత్య మిత్ర దేశాలు ఉక్రెయిన్‌ను ఉపయోగించుకుంటున్నాయని, యుఎస్ సైన్యం ప్రభావంపరిధిని విస్తరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారని ఉత్తర కొరియా అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కెసిఎన్‌ఎ) తెలియజేసింది. రష్యాతో తన దేశ సంబంధాలకు కిమ్ ఇటీవలి మాసాల్లో ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News