Thursday, November 21, 2024

ఉత్తర కొరియా సైనికులు హతం: జెలెనస్కీ

- Advertisement -
- Advertisement -

కివ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు భారీగా మోహరించారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనస్కీ స్పందించారు. ఉత్తర కొరియాకు చెందిన 11 వేల మంది సైనికులు తమ భూభాగంలో ఉండి యుద్ధం చేస్తున్నారని తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం చేతిలో ఉత్తర కొరియా సైనికులు చనిపోయారని జెలెనస్కీ వెల్లడించారు. ఉత్తర కొరియా సైనికుల పట్ల తాము కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని బలగాలు మోహరించే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారనే విషయంపై స్పష్టత లేదన్నారు.

గత రెండు సంవత్సరాల నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటే యుద్ధం ముగిసిపోవడంతో పాటు శాంతి నెలకొంటుందని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ కొందరి వ్యక్తుల్లో చిక్కి రష్యాన్ ఫెడరేషన్ ప్రయోజనాలకు హాని కలిగిస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధం ముగిస్తే కీవ్‌లో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఉక్రెయిన్‌తో సరిహద్దులు నిర్ణయించడంతో పాటు అక్కడ ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని పుతిన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News