Tuesday, December 24, 2024

ఉత్తర కొరియా దళాలను మోహరించనున్న రష్యా

- Advertisement -
- Advertisement -

ఉత్తర కొరియా దళాలను రష్యా ఈ వారాంతంలోనే ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రంలో మోహరించగలదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ శుక్రవారం ఆరోపించారు. అటువంటి పరిణామం దాదాపు మూడు సంవత్సరాల యుద్ధాన్ని తీవ్రతరం చేస్తుందని, ఇండో పసిఫిక్ ప్రాంతం వరకు భౌగోళిక రాజకీయ పరిస్థితులు తలెత్తవచ్చునని పాశ్చాత్య అధికారులు హెచ్చరించారు. ‘మొదటి ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యా యుద్ధ మండలాల్లో ఆదివారం, సోమవారం మధ్య ఉపయోగిస్తుంద’ని ఉక్రెయిన్ వేగులు సూచించారని జెలెన్‌స్కీ తెలిపారు.

ఆ మోహరింపు ‘రష్యా పరంగా ఉద్ధృతం చేసే చర్యే’ అని జెలెన్‌స్కీ ‘టెలిగ్రామ్’లో పేర్కొన్నారు. ఎంత మంది ఉత్తర కొరియా సైనికులు పంపడంతో సహాఇతర వివరాలు వేటినీ ఆయన వెల్లడించలేదు. కీవ్‌ను వెనుకకు తగ్గేలా చేస్తూ ఉక్రెయిన్ తూర్పు రంగంలో వేసవిలో ఉద్ధృతంగా పోరాటాన్ని రష్యా సాగిస్తున్నది. అయితే, దాదాపు మూడు నెలల క్రితం ఉక్రెయిన్ దళాలు చొరబడిన తరువాత తమ కుర్‌స్క్ సరిహద్దులో నుంచి వారిని వెనుకకు నెట్టేందుకు రష్యా తంటాలు పడుతోంది. మాస్కో, ప్యాంగ్‌యాంగ్ మధ్య కుదిరిన సైనిక ఒప్పందం కింద ఉత్తర కొరియా దళాల మోహరింపు జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News