Thursday, January 16, 2025

స్వయంగా యుద్ధ ట్యాంకు నడిపిన కిమ్

- Advertisement -
- Advertisement -

సియోల్ : ఉత్తర కొరియా ఈ మధ్య కాలంలో నిరంతర యుద్ధ సన్నద్ధత , ఆయుధాల ప్రయోగ పరీక్షలతో దూసుకెళ్తోంది. అగ్రరాజ్యం అమెరికా, పొరుగుదేశం దక్షిణ కొరియాను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తోంది. స్వయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ ఎప్పటికప్పుడు సైనిక సన్నద్ధతను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆయన సొంతంగా ఓ యుద్ధ ట్యాంకును నడిపినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీ ఎస్‌ఏ వెల్లడించింది.

వాటికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. సైనికుల్లో స్ఫూర్తి నింపేందుకు స్వయంగా కిమ్ రంగం లోకి దిగినట్టు కేసీఎన్‌ఎ పేర్కొంది. ఇటీవల అభివృద్ధి చేసిన “ప్రపంచం లోనే అత్యంత శక్తిమంతమైన ట్యాంకుల” పనితీరును సైనికులతో ఆయన పర్యవేక్షించినట్టు తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. వీటిని ఉత్తర కొరియా తమపై ఆక్రమణకు సన్నాహకంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిస్పందనగా ట్యాంకులతో తమ పాటవాన్ని ప్రదర్శిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News