Monday, December 23, 2024

ఉత్తర కొరియాలో కరోనా ఉగ్రరూపం: 20 లక్షలకు మించి…

- Advertisement -
- Advertisement -

North Korea covid raises
ప్యోగ్యాంగ్: ఉత్తర కొరియాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. వారం కిందటే అక్కడ మొదటి కేసు ధ్రువీకృతమయింది. వారంలోపే కేసుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుకుంది. గురువారం ఒక్క రోజునే 2,62,270 మందిలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి. కాగా ఒక మరణం సంభవించిన విషయాన్ని కూడా అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 63కు చేరుకుంది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఏప్రిల్ చివరి నుంచి ఇప్పటి వరకూ 1.98 మిలియన్ల మందిలో జ్వరం లక్షణాలు కనిపించాయి. ఇప్పటికే అక్కడ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ, మహమ్మారి కారణంగా సరిహద్దుల మూసివేత, అణ్వాయుధాల సమీకరణతో ఎదుర్కొంటున్న ఆంక్షలు ఉత్తరకొరియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశం ఆహార కొరతను ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News