Friday, December 20, 2024

మీడియాపై మండిపడిన ఎన్‌టిఆర్… ఆ హోటల్ రూమ్‌లో చేసేందేమిటీ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించిన తరువాత యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ వరల్డ్ వైడ్ సెలబ్రిటీగా మారిపోయాడు. దేవర సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. బాలీవుడ్ మూవీ ‘వార్-2’లో ఎన్‌టిఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్‌టిఆర్ ముంబయి వెళ్లాడు. సినిమా షూటింగ్ నుంచి డైరెక్ట్‌గా హోటల్‌కు వెళ్తున్నప్పుడు నార్త్ మీడియా అతడిని పలకరించడానికి ప్రయత్నించింది. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు లోపలికి వెళ్లిపోయాడు. దీంతో నార్త్ మీడియా అతడిపై నెగెటివ్ ప్రచారం చేయడంతో ఆయన అభిమానులు మీడియాపై మండిపడుతున్నారు.

సినిమా షూటింగ్ నుంచి డైరెక్టగా రావడంతో అదే వేషంలో ఉన్నాడని, అతడు మీడియాతో మాట్లాడితే లుక్ బయటకు వస్తే ప్రాజెక్ట్ గురించి బయటకు చెప్పినట్లు అవుతుందని ఎన్ టిఆర్ కోపంతో మీడియా వైపు చూశారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అది అర్థం చేసుకోకుండా నార్త్ మీడియా ఓవర్ చేసిందని అభిమానులు చురకలంటించారు. మినిమమ్ వాల్యూస్ మెయింటైన్ చేయకుండా ఇలాంటి నెగెటివిటీ తీసుకరావడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. వార్2 సినిమాకు ఎన్‌టిఆర్ రూ.80 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News