Thursday, January 23, 2025

సినిమాకు ఉత్తరాది, దక్షిణాది అని చర్చించడం ‘స్టుపిడ్’: నాని

- Advertisement -
- Advertisement -

Nani
న్యూఢిల్లీ: సినిమాలను భాషాతీతంగా ఎంజాయ్ చేయాలని తెలుగు సినిమా స్టార్ నాని అన్నాడు. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో సైతం ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కెజిఎఫ్ వంటి సినిమాలు బాగా ఆడాయని అతడు ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ 38 ఏళ్ల నటుడు ఈ మధ్య కాలంలో తన ‘జెర్సీ’ సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. సినిమా రంగాన్ని బాలీవుడ్, టాలీవుడ్, ఓలివుడ్ అని విభజించుకోవడం స్టుపిడ్ అని అభిప్రాయపడ్డాడు. ఆయన పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో మన భాషలు వేరైనా జాతి ఒకటే అన్నాడు.
నాని అసలు పేరు ఘంట నవీన్ బాబు. అతడు ఈగ, జెంటిల్‌మ్యాన్, దేవదాస్, శ్యామ్ సింగ రాయ్ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అతడి అనేక సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అయ్యాయి. సినిమాలకు ‘పాన్ ఇండియా’ అన్న బ్రాండ్ పెట్టడం కూడా నానికి నచ్చదు. సినిమా బాగుంటే ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారన్నది అతడి అభిప్రాయం. నాని తాజా రోమాంటిక్ కామెడీ సినిమా ‘అంటే సుందరానికి’…దానిని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో నజ్రియా నజీమ్ హిరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ ఓధేల దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘దసరా’ నాని తదుపరి చిత్రం. ఆ సినిమా ఇప్పటికే 30 శాతం పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News