Friday, January 17, 2025

ముంబయి లోకల్ ట్రైన్‌లో నార్వే డ్యాన్సర్ల స్టెప్స్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: తమ అద్భుతమైన నాట్యవిన్యాసాలతో గత ఏడాది ఇంటర్‌నెట్‌ను షేక్ చేసిన నార్వేజియన్ డ్యాన్స్ ట్రూప్ ది క్విక్ స్టయిల్ ప్రస్తుతం ప్రపంచ టూర్ చేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న ఈ ట్రూపు ఇటీవల ముంబై లోకల్ ట్రెయిన్‌లో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రయాణికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.  విరాట్ కోహ్లితో కలసి ఇష్ పాటకు నర్తించిన ఈ బృందం ్రఇప్పుడు ముంబై లోకల్ ట్రైయిన్‌లో చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

లేకే పెహ్లా పెహ్లా ప్యార్ అనే పాత సినిమా పాట రీమిక్స్‌కు చేసిన డ్యాన్స్ వీడియోను ఈ నార్వేజియన్ ట్రూప్ తన అఫిషియల్ ఇన్‌స్టాట్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఇండియాలోని లోకల్ ట్రైయిన్‌లో మా మొదటి అడుగు అన్న క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 40 లక్షల మంది ఈ వీడియోను వీక్షించగా 6 లక్షల లైక్స్, 4300 కామెంట్స్‌తో ఇన్‌స్టాలో ఇది దుమ్ముదులుపుతోంది. ఈ వీడియోను మీరూ వీక్షించెయ్యండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News