Wednesday, January 22, 2025

చైనా నుంచి ఒక్క పైసా కూడా అందలేదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తనపై పెట్టిన కేసు తప్పుడు కేసని, బోగస్ అని, చైనాలో ఎవరినుంచీ ఒక్క పైసా కూడా తీసుకోలేదని న్యూస్‌పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ సోమవారం ఢిల్లీ కోర్టుకు చెప్పారు. చైనా అనుకూల ప్రచారం చేయడం కోసం ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తిరుంచి పెద్ద ఎత్తున నిధులు అందుకున్నారన్న ఆరోపణలపై ప్రబీర్‌ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఉగ్రవాద నిరోధక చట్టం,చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటుగా న్యూస్ క్లిక్ మానవ వనరుల విభాగం చీఫ్ చక్రవర్తిని కూడా అరెస్టు చేశారు. వీరిని ఏడు రోజలు పాటు పోలీసు రిమాండ్‌కు కూడా అప్పగించారు.

తమ అరెస్టును వీరు కోర్టులో సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రబీర్ తనపై పెట్టిన కేసు బోగస్ అని వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ గెడెలా తీర్పును వాయిదా వేశారు. చైనాకు చెందిన ఓ వ్యక్తినుంచి ప్రబీర్‌కు రూ.75 కోట్ల నిధులు అందాయన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసుకు చెందిన స్పెషల్ సెల్ ఆయనతో పాటుగా చక్రవర్తిని అరెస్టు చేసింది. తమ అరెస్టును సవాలు చేస్తూ వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. దర్యాప్తు ఏజన్సీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News