- Advertisement -
ఏడాదిలో ఇది కీలక రికార్డు
నాగ్‌పూర్ : కరోనా కేసుల ఉధృతి నగరం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఏడాదిలో నాగ్‌పూర్‌కు సంబంధించి ఇది ఓ రికార్డు అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు శనివారం తెలిపారు.నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలో ఒక్క వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే శనివారం నాగ్‌పూర్‌లో ఏ ఒక్కరూ వైరస్‌కు గురికాలేదని నిర్థారణ అయిందని వివరించారు. ఈరోజే పది మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఎవరూ చనిపోలేదని వెల్లడైంది. ఇక్కడ కరోనాను నియంత్రించడంలో పాటుపడిన వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బందిని నాగ్‌పూర్ సంరక్షణ బాధ్యతల మంత్రి నితిన్ రౌత్ అభినందించారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటూ, కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
- Advertisement -