నేచురల్ స్టార్ నాని ’సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ భారీ అంచనాలను సృష్టిస్తున్నాయి. శనివారం మేకర్స్ ఎస్‌జె సూర్య పుట్టినరోజు సందర్భంగా నాట్ ఏ టీజర్ అనే న్యూ వీడియోని రిలీజ్ చేశారు. చెడు బలపడినప్పుడు దాన్ని అంతంచేసే పవర్ పుడుతుందనే ఆసక్తికరమైన వాయిస్ ఓవర్ తో వీడియో ప్రారంభమైంది.
బలహీనులపై తన ఆధిపత్యాన్ని చూపించే కాప్‌గా ఎస్‌జె సూర్య పరిచయమయ్యారు. ఈ కథ నుంచి శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి నరకాసురుడు (ఎస్‌జె సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తున్నట్లుగా చూపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. టేకాఫ్ నుండి చివరి వరకు వీడియో గ్రిప్పింగ్ గా వుంది. ఎస్‌జె సూర్య భయం పుట్టించేలా కనిపించగా, నాని తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా ఉన్నారు.
ఇద్దరూ తమ పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. వివేక్ ఆత్రేయ స్టొరీ టెల్లింగ్ లో యూనిక్ స్టయిల్ వున్న జీనియస్. నాట్ ఎ టీజర్ వీడియోలో తన నరేటివ్ స్టయిల్ ఆకట్టుకుంది. మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి, జేక్స్ బిజోయ్ తన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేశారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.