Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌తో పొత్తుండదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితు ల్లో బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెడ మీద తలకాయ లేని వాడు బిఆర్‌ఎస్, బిజెపి పొత్తు అని మాట్లాడుతారని మూర్ఖుడు, దుర్మార్గుడు చేస్తున్న ప్రచారాన్ని తాము ఖాతరు చేయమన్నా రు. సోమవారం తమ పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను బిఆర్‌ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని, ఆపార్టీ తెలంగాణకు అవసరం లేదన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని, వారి మాదిరిగా తాము చీకటి రాజకీయాలు చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిస్తూ పార్టీ కార్యకర్తలు అలాంటి మాటలు నమ్మవద్దని సూచించా రు. రాష్ట్రంలో తమ పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలను ఎన్నికల షెడ్యూల్ రాకముందే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

ప్రచార మాధ్యమాలు ద్వారా వస్తున్న సమాచారం మేరకు మార్చి మొదటి వా రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. దేశంలో వ్యా ప్తంగా బిజెపి 370 సీట్లు, ఎన్‌డిఏ కూటమి 400 సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇదే సందర్భంగా ఇండియా కూటమిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ కూటమి రోజు రోజుకు ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని దీంతో ఆ కూటమి నుండి పలు పా ర్టీల నాయకులు బయటకు వస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల తరువాత విదేశాలకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతులు చాలా మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధ్దంగా ఉన్నారని వారిని సంకల్ప యాత్రలో చేర్చుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News