ఆర్థిక అవకతవకలు లేదా గణనీయమైన పన్ను బకాయిలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రమే అటువంటి క్లియరెన్స్ అవసరం.
న్యూఢిల్లీ: విదేశీ ప్రయాణాలకు పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్లను పొందడం తప్పనిసరి చేసిన బడ్జెట్ ప్రతిపాదనపై సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ప్రతిపాదిత సవరణ భారతదేశంలోని నివాసితులందరికీ కాదని ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. ఆర్థిక అవకతవకలు లేదా గణనీయమైన పన్ను బకాయిలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రమే అటువంటి క్లియరెన్స్ అవసరమని తెలిపింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక బిల్లు-2024లో బ్లాక్ మనీ యాక్ట్, 2015 యొక్క సూచనను చట్టాల జాబితాలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని కింద ఎవరైనా పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందేందుకు తన బకాయిలు క్లియర్ చేయాలంది.
కొన్ని సందర్భాల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం. అవి ఎలాంటివంటే: తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం లేదా సంపద పన్ను చట్టం కింద విచారణకు హాజరు కావలసిన వ్యక్తి, డైరెక్ట్ ట్యాక్స్ యెరియర్స్ రూ. 10 లక్షలకు పైగా బాకీ ఉన్న వ్యక్తి ట్యాక్స్ క్లియరెన్స్ పొందలేరు. విదేశాలకు వెళ్లడం సాధ్యపడదు.