Monday, December 23, 2024

ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు: యాపిల్ హెచ్చరిక మెసేజ్‌పై కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మీ ఐఫోన్ హ్యాక్ అయిందంటూ యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్ అందుకున్న ప్రతిపక్ష నాయకులలో తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కూడా చేరిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదిగా వెల్లడించారు.

ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు తన ఫోన్‌ను లక్షంగా చేసుకున్నట్లు యాపిల్ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని కెటిఆర్ తెలిపారు. ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడంలో బిజెపి ఎంతటి నీచానికైనా దిగజారుతుందని మనకు తెలుసుకాబటి తాను ఈ విషయం విని ఆశ్చర్యపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

తమకు యాపిల్ నుంచి వార్సింగ్ మెసేజెస్ వచ్చినట్లు మంగళవారం పలువురు ప్రతిపక్ష నాయకులు తెలిపారు. యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు అందుకున్న వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, కాంగ్రెస్ ఎంపి శశి థరూర్, శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది, టిఎంసి ఎంపి మహువా మొయిత్ర, ఆప్ ఎంపి రాఘవ్ చద్దా తదితరులు ఉన్నారు.

తమ ఫోన్లపై ప్రభుత్వమే నిఘా పెట్టినట్లు ప్రపతిక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. తమ ఫోన్లకు వచ్చిన వార్నింగ్ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్లుగా వారు షేర్ చేశారు.

ఈ పరిణామం కారణంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తీవ్ర వివాదం ఏర్పడడంతో యాపిల్ సంస్థ అధికారికంగా స్పందించింది. ఈ హెచ్చరిక మెసేజ్‌లు నిర్దిష్టంగా ఏ ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్‌కో తాము ఆపాదించలేమని వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News