మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎన్నటికీ బిజెపికి ‘బి’ టీం కాదని, గతంలో బిజెపితో పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ పొత్తు ఉండదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చెందిన ముగ్గురు ఎంపిలను, ఇద్దరు ఎంఎల్‌ఎలను ఓడించామని గుర్తు చేశారు. కెసిఆర్ 45 ఏం డ్ల రాజకీయ జీవితంలో బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.తెలంగాణ భవన్‌లో శు క్రవారం జరిగిన భువనగిరి లోక్‌సభ సన్నాహక సమావేశానికి మాజీ స్పీక ర్లు పోచాం శ్రీనివాస్‌రెడ్డి,మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్‌రె డ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంఎల్‌ఎ లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గ్యాదరి కిశో ర్, గొంగిడి సునీత, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు పొ న్నాల లక్ష్మయ్య, ఇతర నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు. బిఆర్‌ఎస్‌కు బిజెపి బి టీం అయితే ఎంఎల్‌సి కవితపై కేసు పెట్టేవారా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యం తప్ప బిజెపితో సంబంధాలు కారణం కాదని స్పష్టం చేశా రు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కయి బిఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయని విమర్శించారు. గత పా ర్లమెంటు ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ కలిసి బిఆర్‌ఎస్‌ను ఓడించాయని అ న్నారు. ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రె స్, బిజెపి పార్టీలు ఒక్కటయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్, బిజెపి పా ర్టీలు కుమ్మక్కు కావడవం వల్లనే రెం డు ఎంఎల్‌సి ఉప ఎన్నికలకు వేర్వే రు నోటిఫికేషన్లు వచ్చాయని అన్నా రు. కేంద్ర మంత్రి అమిత్ షాను
సీఎం రేవంత్ రెడ్డి కలవగానే ఎంఎల్‌సి ఉప ఎన్నిక పద్ధతి మారిపోయిందని ఆరోపించారు. ఎంఎల్‌సి ఉప ఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా తమకు నిరాశ తప్పలేదని తెలిపారు. బిజెపి మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటోందని కెటిఆర్ ఆరోపించారు. బిజెపి వాళ్లు పొలిటికల్ హిందువులైతే.. కెసిఆర్ మతాన్ని మతంగా చూసే హిం దువు అని పేర్కొన్నారు. తాము కూడా యాదాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిలో పంచితే గెలిచేవాళ్లేమేమో అ ని అభిప్రాయపడ్డారు. బిఆర్‌ఎస్ నిజమైన సెక్యులర్ పార్టీ అని స్పష్టం చేశారు.
ఎంఎల్‌ఎ చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదు
ఇక ఎంఎల్‌ఎ చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. పార్టీ చుట్టూ ఎంఎల్‌ఎ తిరిగే పద్ధతి ఉంటుందని కెటిఆర్ తెలిపారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎంతమాత్రమూ సహించమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలు సీరియస్‌గా తీసుకుంటామని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులను సమష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు. ఒక కాకికి ఆపద వస్తే మిగతా కాకులు ఒక్కచోట చేరినట్లే.. పార్టీ కార్యకర్తకు ఆపద వస్తే అంద రూ అలాగే నిలవాలని సూచించారు.
ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదు
తమను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్‌ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అలా ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిం ది కూడా మన తెలంగాణ ప్రజలేననన్న విషయాన్ని మరవకూడదని హితవు పలికారు. బిఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదని, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజ లు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూయించారని తెలిపారు. ఎందుకు ఇలా జరిగిందో విశ్లేషించుకుందామని వ్యాఖ్యానించారు.
కొంతమంది చేయి గుర్తుకు వేసిన పెద్దమనుషులు కెసిఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసిందని పేర్కొన్నారు. కచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందని అన్నారు.119 సీట్లల్లో 39 గెలిచాం అంటే మూడోవంతు గెలిచామని, మిగతా 14 స్థానాల్లో కేవలం స్వల్ప ఓట్ల తేడాతో ఓడామని, అవికూడా గెలిచివుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. పదేండ్ల పాటు విరామమెరుగక పనిచేసిన కారు మరింత స్పీడుగా పనిచేసేందుకు సర్వీసింగ్‌కు పోయిందే తప్ప షెడ్డులోకి పోలేదని కెటిఆర్ చమత్కరించారు. తమకు ఓటమి కొత్త కాదని, ఇది స్పీడ్ బ్రేకర్ లాంటిదే అని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జయకేతనం ఎగరేయడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు తమ సత్తాచాటాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
పూర్తి బాధ్యత నాదే
గత పదేళ్లలో పరిపాలనపై దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదని, ఇందుకు పూర్తి బాద్యత తనదే అని కెటిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్లమెంటరీ సమీక్షల్లో పార్టీ ఒడిపోవడానికి గుర్తించిన ప్రధాన కారణాలను విశ్లేషించారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఈ పదేండ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని, ప్రభుత్వానికి, పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా నేరుగా లబ్దిదారునికే చేరడం వల్ల ఓటరుకు కార్యకర్తకు లింకు తెగిందని వివరించారు. రేషన్ కార్డులు 6 లక్షలకు పైగా ఇచ్చినా జనంలో తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. కొత్త పెన్షన్లు ప్రతి నియోజవర్గంలో 15 వేలకు వరకు ఇచ్చామని, దానిని జనంలోకి తీసుకెళ్లలేకపోయామని, వందలో ఒక్కరికి రాకుంటే అదే నెగెటివ్‌గా ప్రచారమైందని తెలిపారు. దళిత బంధు కొందరికే రావడంతో మిగతావారు ఓపికపట్టలేక అసహనం ప్రదర్శించి వ్యతిరేకమయ్యారని, ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత కనిపించిందని అన్నారు.
రైతుబంధు తీసుకున్న సామాన్య రైతు కూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే ఒప్పుకోలేదని, వీటితో పాటు ఇంకా కొన్ని కారణాలున్నాయని తెలిపారు. కాగా, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజల్లో వచ్చిన వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనావేయలేకపోవడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినట్టుగా తమ విశ్లేషణలలో తేలిందని వివరించారు. రోజువారీగా జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో వెల్లడవుతున్న అభిప్రాయాలను ఏరోజుకు ఆరోజు పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌కు నివేదిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కవ్వించింది
నూతన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఉన్న తమను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెచ్చగొడుతున్నదని కెటిఆర్ వివరించారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ఉద్దేశపూర్వకంగా తమను కాంగ్రెస్ పార్టీ కవ్వించిందని తెలిపారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మనం కూడా గట్టిగా సమాధనం చెప్పకతప్పని స్థితిలోకి నెట్టబడినామని కెటిఆర్ పార్టీ శ్రేణులకు వివరించారు. అందులో భాగంగానే తాము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధారుణమైన ఆరోపణలను తిప్పికొట్టాల్సి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కొన్నాళ్ల పాటు సమయమిచ్చి సంయమనం పాటించాలని పార్టీ అధినేత కెసిఆర్ తమకు సూచించారని .. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అందుకు విరుద్దంగా సాగుతోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినవాళ్లు కుదురుకునేందుకు ప్రయత్నం చేయడం మానేసి ప్రతిపక్షంలో ఉన్న మనలను రెచ్చగొట్టుకుంటూ కాలం ఎల్లదీయాలనే ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. గెలుస్తామనే విశ్వాసం లేని స్థితిలో, అధికారం కోసం అర్రులు చాచి, అలవికాని హామీలిచ్చి నేడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేసే క్రమంలో శ్వేతప్రతాల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. వీరి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కెసిఆర్ తయారుచేసిన జగదీశ్ రెడ్డి, తదితర తమ వంటి కార్యకర్తలే అసెంబ్లీలో ధీటుగా తిప్పికొడితే..త్వరలో స్వయంగా కెసిఆరే అంసెంబ్లీకి వస్తే పరిస్తితి ఎట్లా వుంటుందో వూహించలేరని అన్నారు.
ప్రజావ్యతిరేక వైఖరులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీయాలని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని, ఎస్‌సి, బిసి మహిళా తదితర డిక్లరేషన్లతో కలిపి అవి సరిగ్గా 420 ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా వంటి హామీల మీద ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుక మడతేసిందని ఆరోపించారు. రైతుబంధు పడక కరెంటు కోతలతో ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు ఎదురుచూపులతో అసహనంతో ఉన్నారని అన్నారు. సరైన సంఖ్యలో బస్సు లు లేక మహిళలు, మహిళా ప్యాసెంజర్లు లేక ఆటోడ్రైవ ర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదన్నదని, తక్షణమే ఆ వర్గాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కెటిఆర్ డిమాండ్ చేశా రు. లేనట్లయితే ప్రజల్లో అసంతృప్తి ప్రబలడం ఖాయమన్నారు. తామెన్నడూ వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేయలేదని, ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ, పించన్ల పెంపుపై రేపే వచ్చే అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మీరు ఆగండి నేను వచ్చినంక డిసెంబర్ 9 నాడు అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయమని గుర్తు చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. ఇటువంటి ప్రజావ్యతిరేక వైఖరులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీయాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా లోక్‌సభ సన్నాహక సమావేశాలకు 13) నుంచి ఈ నెల 16 వరకు పార్టీ విరామం ఇచ్చింది. మళ్లీ ఈ నెల 17వ తేదీ నుంచి యథావిధిగా సమావేశాలు కొనసాగుతాయి. 16న జరగాల్సిన నల్గొండ సన్నాహక సమావేశం 22వ తేదీకి వాయిదా వేసింది.