Monday, December 23, 2024

పార్టీ మారడం లేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండడంతో ఆయన స్పష్టత ఇచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి కూడా బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళుతున్నారని రూమర్లు వెల్లువెత్తాయి. అన్ని చర్చలు జరిగాయని, జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరిన రోజే, బిఆర్‌ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తారని విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారబోవడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు అబద్ధాలని చెప్పుకొచ్చారు. పార్టీ వీడుతున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News