Wednesday, January 22, 2025

సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవద్దు: బూర నర్సయ్య

- Advertisement -
- Advertisement -

Not contesting Munugode: Boora Narsaiah Goud

హైదరాబాద్: మునుగోడులో పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తాననే ప్రచారంలో అవాస్తవం అన్నారు. సోషల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు. అలాంటి ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థి, టిఆర్ఎస్ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని బూర నర్సయ్యగౌడ్ తేల్చిచెప్పారు. పదవులు, డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికకు టిఆర్ఎస్ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్ర‌క‌టించిన ముచ్చట తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News