Monday, December 23, 2024

డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. ఆయిల్ ఇంజన్ సర్కార్

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్
  •  మండుటెండలలో సైతం నక్కవాగు జల కల
  • మాటిండ్ల గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ కోరిక నెరవేరింది
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

నారాయణరావుపేట: డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్ ప్రాంతాలోని ప్రజలకు అడిగితే ఆరు రోజులకు ఒకసారి స్థలాలు వస్తాయి… కానీ సిఎం కెసిఆర్ పుణ్యమా అని నిత్యం ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు వస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్, శేఖర్‌రావుపేట, బంజేరుపల్లి మాటిండ్ల గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చత్తీస గఢ్, కర్ణాటకలో ఏడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని, కానీ తెలంగాణలో మాత్రం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారన్నారు . డబుల్ సర్కార్ ఉన్న యూపీలో కరెంట్ దిక్కు లేక వ్యవసాయ పంటలు పండించడం కోసం 20 లక్షల ఆయిల్ ఇంజన్లు నడుస్తున్నాయమని మంత్రి విమర్శించారు. మండుటెండల్లో సైతం నక్కవాగు చెరువు జళకళను సంతరించుకుందన్నారు. మాటిండ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 35 బోర్లు వేసినా చుక్క నీళ్లు రాలేదని, సిఎం కెసిఆర్ పుణ్యమా అని ఇంటింటికి మిషన్ భగీరథ, కాళేశ్వరంతో తాగు, సాగునీరు గోస తీరిందని మంత్రి వెల్లడించారు. మాటిండ్ల గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ కోరిక నెరవేరిందన్నారు.

దర్గాకు మెట్లు, శేఖర్‌రావుపేటకు ఫంక్షన్ హాల్ రూ. 3.80 కోట్ల రూపాయలతో జిల్లెల వరకు రోడ్డు సౌకర్యం, బిసి కమ్యూనిటీ హాల్, మహిళా మండలి భవనం ప్రారంభాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఒగ్గు బాలకృష్ణ యాదవ్, ఎంపిపి ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్, సర్పంచులు దరిపల్లి వజ్రవ్వ, దుర్గం పర్షరాములు, కొంగరి నారాయణ, సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు శాతరాజుపల్లి ఆంజనేయులు, ఎంపిటిసిలు ఆకుల హరీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News