- Advertisement -
న్యూఢిల్లీ: జూన్ 1న ఏడో దశ ఎన్నికలు ముగిశాక బిజెపి గెలుస్తుందని, నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాని కానున్నారని అనేక ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. అయితే ఓట్ల లెక్కింపు జూన్ 4న(మంగళవారం) జరుగనున్నది.
ఇండియా బ్లాక్ మిత్రపక్షాలు ఈ ఎగ్జిట్ పోల్స్ ను ‘ మోడీస్ పోల్’ లేక ‘మోడీ అనుకూల పోల్’ అని వ్యాఖ్యానించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకు ‘గోది మీడియా’ నుంచే వచ్చయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ను ‘మోడీస్ ఫాంటసీ పోల్’ అని అభివర్ణించారు. ‘ఇది ఎగ్జిట్ పోల్ కాదు, ఇది మోడీ మీడియా పోల్’ అని విలేకరులతో అన్నారు.
Watch: "This is not an exit poll, it's Modi Media Poll. This is Modi's fantasy poll," says Congress leader Rahul Gandhi pic.twitter.com/OqjfsU2BcH
— IANS (@ians_india) June 2, 2024
- Advertisement -