Sunday, November 17, 2024

టీకా రియాక్షన్లు సహజమే

- Advertisement -
- Advertisement -

ఆందోళన అవసరం లేదు
క్లినికల్స్‌లో సమర్ధతను పరీక్షించిన తర్వాతనే వినియోగిస్తున్నాం
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి
శరీరాన్ని బట్టి వ్యాక్సిన్ స్పందన కనిపిస్తుంది
వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Not health problem with Corona vaccine

మన తెలంగాణ/హైదరాబాద్ :వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రీయాక్షన్లు సహజమేనని, ఎలాంటి అందోళన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న కొవిడ్ 19 వ్యాక్సిన్లు చాలా సురక్షితమైనవి తెలిపింది. వీటిని తీసుకోవడం మన శరీరంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిరక్షకాలు వృద్ది చెందుతాయన్నది. క్లినికల్స్ ట్రయల్స్ పనితీరును పరిశీలించిన తర్వాతనే వ్యాక్సిన్ల వినియోగానికి అంగీకరించినట్లు డబ్లూహెచ్‌ఓ పేర్కొంది. అయితే శరీర పరిస్థితులను బట్టి ఒక్కోక్కరిలో ఒక్కొ సమయానికి టీకా స్పం దన ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ రెండు డోసు లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కొవిడ్ 19 నుంచి రక్షణ లభిస్తుందని స్పష్టత ఇచ్చింది.

టీకా తర్వాత తగిన శాతంలో యాంటీబాడీలు వృద్ధి చెందకపోతే సదరు వ్యక్తులకు మరోసారి వైరస్ సోకిన ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదన్నది. కానీ పాజిటివ్ తేలినా తీవ్రత మాత్రం అతి సాధారణంగా ఉంటుందన్నది. టీకా తర్వాత స్వల్ప రీయాక్షన్లు తేలితేనే సదరు వ్యక్తి శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి ప్రారంభమైనట్లని డబ్లూహెచ్‌ఓ చెప్పింది. ఇలా వచ్చిన తర్వాత శరీరంలోని రక్త ప్రసరణ వేగవంతమై ఇమ్యూనిటీ సిస్టం బలోపేతమవుతుందని వివరించింది. తద్వారా శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను సులువుగా చంపేందుకు ఆస్కారం ఉంటుందని డబ్లూహెచ్‌ఓ తెలిపింది. ఎలాంటి రీయాక్షన్లు రానంత మాత్రమే వ్యాక్సిన్ పనిచేయడం లేదనేది అవాస్తవమని తేల్చిచెప్పింది.కరోనా సేకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు డబ్లూహెచ్‌ఓ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఈ మేరకు తాజాగా“ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కొవిడ్ 19 వ్యాక్సిన్‌” పేరిట పలు అంశాలను వివరిస్తూ డబ్లూహెచ్‌ఓ తాజాగా ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. స్వల్ప, మధ్యస్థ, తీవ్రమైన రీయాక్షన్లు అనే మూడు అంశాలుగా విభజించి వర్ణించింది.

30 నిమిషాల్లోపే సీరీయస్ రియాక్షన్లు

టీకా తీసుకున్న తర్వాత శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వస్తే వీటిని సీరియస్ రియాక్షన్లుగా పరిగణిస్తామని డబ్లూహెచ్‌ఓ పేర్కొంది. అయితే ఇలాంటివి ఒక వేళ వస్తే కేవలం 30 నిమిషాల్లోపు మాత్రమే వచ్చే ఆస్కారం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పింది. ఈక్రమంలోనే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సదరు లబ్ధిదారుడిని అర్ధగంట సేపు అబ్జర్వేషన్ నిబంధనను అమలు పరుస్తున్నట్లు వెల్లడించింది. కానీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చర్మంపై దద్దుర్లు, చేతినొప్పి, నీరసం, లైట్ ఫీవర్, దురద, వాపు, అలసట, తలనొప్పి, జాయింట్ ఫెయిన్స్, కండరాల నొప్పి, నీరసం, శరీరం వేడెక్కడం, ఎర్రబారడం వంటివి వస్తే స్వల్ప సమస్యలుగా అంచనా వేయాలని డబ్లుహెచ్‌ఓ పేర్కొంది. అంతేగాక ఇంజక్షన్ వేసిన దగ్గర గడ్డలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, శరీర ఉష్ణోగ్రత భారీగా పెరగడం, ముక్కు కారడం, దగ్గు, గొంతులో మంట వంటివి మధ్యస్థ రీయాక్షన్లుగా లెక్కించాలంది. అంతేగాక పొత్తికడుపు నొప్పి, ఆకలి తగ్గడ ం, విపరీతంగా చెమట రావడం, చర్మంపై దద్దుర్లు, విపరీతమైన దురదలు వచ్చినా పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదంది. కానీ ఇవేమి ప్రమాదకరంగా మారే అవకాశం లేదని డబ్లూహెచ్‌ఓ ప్రకటించింది.

మానవ తప్పిదాలతో కూడా…

మానవ తప్పిదాలతో కూడా సీరియస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని డబ్లూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు చేసింది. వాస్తవంగా వ్యాక్సిన్లను తయారీ కంపెనీ సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా శీతల ఉష్ణోగ్రతలలో నిల్వ చేయాలి. వీటి టెంపరేచర్ లెవల్స్‌ను సక్రమంగా నిర్వహించలేకపోయినా ఆ వయల్స్ వికటించినట్లేనని వివరించింది. దీంతో ఆ డోసులు తీసుకున్న వారికి సీరియస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్టోరేజ్ సెంటర్ నుంచి వ్యాక్సినేషన్ బూత్‌లకు తరలించేటపుడు కూడా నిర్దేశించిన ఉష్ణోగ్రతల సౌకర్యం లేకపోయినా, లబ్ధిదారుడు రాకముందే అన్ని సిరంజీలలో డోసులు నింపినా ప్రమదమేనని డబ్లూహెచ్‌ఓ చెబుతుంది. అంతేగాక వయల్ నుంచి సిరంజీలోకి 0.5 ఎంల్ కంటే అదనంగా తీసుకొని, మళ్లీ ఆ వయల్‌లోకి డోసు పంపినా ప్రమాదమేనని చెప్పింది. మరోవైపు శరీరంలోని జబ్బకు కాకుండా మరోచోట టీకా వేసినా సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరించింది.

వీరు ఎట్టి పరిస్థితుల్లో టీకా వేసుకోవద్దు

వ్యాక్సిన్ తీసుకునే సమయానికి జ్వరం, బ్లీడింగ్, రోగ నిరోధక శక్తి తగ్గించే మెడిసిన్ వినియోగిస్తున్న వాళ్లు, గర్భిణీలు, బాలింతలు డాక్టర్లు సూచనలతో మాత్రమే టీకా తీసుకోవాలని డబ్లూహెచ్‌ఓ పేర్కొంది. అంతేగాక18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవద్దని వివరించింది.

రాష్ట్రంలో రియాక్షన్ల శాతం ఇలా…

రాష్ట్రంలో రియాక్షన్ల శాతం చాలా తక్కువగా తేలింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆదిలాబాద్‌లో 0.01, భద్రాద్రి 0.15, జనగాం 0.04, భూపాలపల్లి 0.17, గద్వాల 0.06, కరీంనగర్ 0.02, జగిత్యాల 0.08, ఆసిఫాబాద్ 0.01, మహబూబాబాద్ 0.06, మంచిర్యాల 0.06, మహబూబ్‌నగర్ 0.03, ఖమ్మం 0.02, హైదరాబాద్ 0.03, మెదక్ 0.01, మేడ్చల్ 0.01, ములుగు 0.02, నాగర్ కర్నూల్ 0.02, నారాయణపేట్ 0.05, నిర్మల్ 0.05, నిజామాబాద్ 0.01, పెద్దపల్లి 0.01, సిరిసిల్లా 0.11, రంగారెడ్డి 0.02, సంగారెడ్డి 0.02, సిద్ధిపేట్ 0.07, సూర్యాపేట్ 0.04, వికారాబాద్ 0.02, వనపర్తి 0.02, వరంగల్ రూరల్ 0.01, వరంగల్ అర్బన్ 0.01, యాదాద్రిలో 0.03 శాతం మందికి రీయాక్షన్లు వచ్చినట్లు వైద్యశాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News