Thursday, January 23, 2025

పెళ్లి మీద ఆసక్తి లేదు

- Advertisement -
- Advertisement -

 

హీరోయిన్ సదా మళ్ళీ నటిస్తోంది. ఈ సారి వెబ్ సిరీస్‌తో అడుగుపెట్టింది ఈ ‘జయం’ భామ. ఆమెకిప్పుడు 38 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే… పెళ్లి ఆలోచన లేదు అని చెబుతోంది. పెళ్లి మీద ఆసక్తి లేకపోవడానికి ఆమె చెప్పిన కారణం కొంత వింతగానే ఉంది. నన్ను పెళ్లి చేసుకునేవాడు నా సంపాదన మీద ఆధారపడొద్దు… అని అంటోంది సదా. మరి, అలాంటి వాడినే చేసుకుంటే సరిపోతుంది కదా. భార్య హౌజ్ మేకర్‌గా ఉంటే చాలు అనుకునే మగాళ్లే భారతదేశంలో ఎక్కువ.

ఆమెకి అలాంటి వాళ్ళు దొరకడం లేదా? ఆమె చెబుతున్న కారణం సమంజసంగా లేదు. మరేదో కారణం ఉండి ఉంటుంది. అది చెప్పలేక, ఇలా సెలవిస్తున్నట్లు అనిపిస్తోంది. హీరోయిన్ గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది సదా. ‘జయం’ సినిమాతో పాపులర్ అయి ‘అపరిచితుడు’ వంటి సంచలన విజయాల్లో నటించిన సదా ఇటీవల నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ ‘హలో వరల్డ్’తో రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో ఇప్పుడు హీరోయిన్‌గా అవకాశాలు రావు. అలాగని, హీరోలకు తల్లి పాత్రలు పోషించలేను అంటోంది. అందుకే ఆమె వెబ్ సిరీస్‌లు బెస్ట్ అనుకుంటోంది ఈ భామ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News