Wednesday, January 22, 2025

రాష్ట్రపతిని పిలువక పోవడం దారుణం : రాములు నాయక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం లేకపోవడం చాలా దారుణమని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంఎల్‌సి రాములు నాయక్ అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాముడు సీతా సమేతంగా అడవులలో జీవించినపుడు శబరి అనే ఆదివాసి మహిళ ఆకలి తీర్చిందని పేర్కొన్నారు. అలాంటిది రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించక, రాష్ట్రపతి హోదాలో దేశ ప్రథమ మహిళగా ఉన్న ఒక ఆదివాసీ మహిళ ను ఎలా అవమాన పరుస్తారని ప్రశ్నించారు. ఈ చర్య దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు చాలా ఆవేదనకు గురిచేసిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

బిజెపి ప్రభుత్వానికి ఆదివాసీలను అవమాన పరచడం అలవాటు అయిందన్నారు. భర్త లేడని ముర్మును అవమాన పరుస్తున్నారని, మరి మోడీకి భార్య… కదా! ఆయన ఎలా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ప్రశ్నించారు. ఆదివాసులను అవమాన పరిస్తే బిజెపి తగిన మాల్యం చేల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును గౌరవించి ఆమెను సాదరంగా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జగన్ లాల్ నాయక్, మంగిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News