Monday, December 23, 2024

ఓటిటిలోకి రాబోతున్న ‘కల్కి 2898 ఏడి’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాక్సాఫీసు వద్ద మంచి రాబడిని సాధించిన ‘కల్కి 2898 ఏడి’ సినిమా త్వరలో ఓటిటిలోకి రానున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఓటిటిలోకి ఈ సినిమా కాస్తా ఆలస్యంగానే రానున్నది. దక్షిణ భారతీయ భాషల ఓటిటి హక్కులను అమేజాన్ ప్రైమ్ కొనగా, హిందీ వర్షన్ ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ కొన్నది. అయితే ఈ సినిమా నిర్మాతలు ఓటిటిలో డిజిటల్ రిలీజ్ తేదీని వాయిదా వేయమని కోరుతున్నారని వినికిడి.

ఈ సినిమా జులై చివర్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తుందని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారం ఓటిటిలోకి రాబోతున్నదని. థియేటర్లలో ఈ సినిమా ఇంకా బాగా నడుస్తున్నందున దీనిని మరికొన్ని రోజులు థియేటర్లలో నడపాలని నిర్మాతలు అనుకుంటున్నారట.

‘కల్కి 2898 ఏడి’ సినిమాలో చాలా మంది నటీనటులు పనిచేశారన్నది తెలిసిన విషయమే. పైగా ఈ సినిమా రెండో భాగం కూడా రూపొందుతోందని, అందులో 60 శాతం పూర్తయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. రెండో భాగంలో కొన్ని ముఖ్యమైన సీన్లను మాత్రం ఇంకా పూర్తిచేయాల్సి ఉందంటున్నారు. చాలా వరకు పూర్తయిపోయందనే అంటున్నారు.

అయితే నిర్మాత అశ్వినీ దత్ కల్కి 2898 ఏడి రెండో భాగం విడుల తేదీని ఇంకా అనుకోలేదని స్పష్టం చేశారు. అయితే ఆ సినిమా చాలా వరకు పూర్తయిందనే అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News