Friday, November 1, 2024

ఇష్టపూర్వక శృంగారం చేస్తే… ఆధార్, పాన్ చూడాల్సిన పనిలేదు

- Advertisement -
- Advertisement -

Not Need to check Aadhaar PAN before consensual sex

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ : ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొనే వ్యక్తులు, భాగస్వామి వయసు తెలుసుకునేందుకు ఆధార్, పాన్ కార్డు చెక్ చేయాల్సిన అవసరం లేదని ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మైనర్‌ను రేప్ చేసినట్టు ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా, అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ జస్మీత్ సింగ్ విచారించారు. అయితే ఆ మహిళకు రికార్డుల ప్రకారం మూడు రకాల పుట్టిన రోజులు ఉన్నాయని, రేప్ జరిగిన నాటికి ఆమె మైనర్ కాదని కోర్టు అభిప్రాయపడింది. ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి, తన భాగస్వామి డేట్ ఆఫ్ బర్త్‌ను తెలుసుకోవాల్సిన అవసరం లేదని, దాని కోసం ఆ వ్యక్తి ఆధార్, ప్యాన్ కార్డును పరిశీలించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొన్నది. ఆధార్ కార్డులో ఆ మహిళ పుట్టిన రోజు 01.01.1998 గా ఉందని, ఈ ఒక్క ఆధారంతో ఆమె మైనర్ కాదని తెలుస్తోందని జడ్జి తెలిపారు. అయిఏ అమ్మాయికి భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయ్యిందని, బెయిల్ ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం అవుతుందని కోర్టు తెలిపింది. హనీ ట్రాపింగ్ కేసుల గురించి జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. పోలీసులు అలాంటి కేసుల్ని సునిశితంగా విచారించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News