Wednesday, January 22, 2025

ఎలాంటి నోటీసులు రాలేదు

- Advertisement -
- Advertisement -

Not received any notice from ED says mlc kavitha

మీడియాను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు
ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసిన ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్ : ఇడి నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చొని కొందరు ఉద్దేశపూర్వకంగా మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు.ఈ క్రమంలోనే తనకు ఇడి అధికారుల నుంచి నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఈ వార్తలను తాను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. ఇదంతా చూస్తుంటే తనపై ఒక పథకం ప్రకారం కుట్ర జరుగుతున్నట్లుగా తెలుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని కవిత తీవ్ర స్థాయిలో అసంతృప్తి…ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీడియా కూడా వారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మకుండా తమ సమయాన్ని నిజాలను చూపించేందుకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం కుంభకోణంలో తనకు ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు కవిత వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News