టిఎస్‌ఎస్పీడీసీఎల్ సిఎండి రఘుమారెడ్డి
హైదరాబాద్: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పతంగులు ఎగుర చిన్నలు ,పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకుని పండగను ఆనందంగా జరుపుకోవాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సిఎండి జి.రఘుమారెడ్డి వినియోగదారులకు విజ్ఙప్తి చేశారు. విద్యుత్ స్తంబాలు, తీగలు వంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరకరాలు లేని ప్రాంతంలో పతంగులు ఎగురవేయాలని, అదే విధంగా విద్యుత్ స్తంభాలు తీగలు,ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలి పటాలను ఎగుర వేయకూడదన్నారు. విద్యుత్ వైర్ల మీద పడిన గాలిపటాలను తీసుకునే ప్రయత్నం చేయవద్దని వాటి ద్వారా విద్యుత్ శాక్‌కు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. పతంగులను ఎగురవేసేందుకు మెటాలిక్ దారాలును వినియోగంచ వద్దని వాటి ద్వారా విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
భవనాల మీద నుంచి గాని, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులును ఎగురవేసి ప్రయత్నం చేయవద్దని, వీటి ద్వారా విద్యుత్ తీగలు శరీరానికి తాకి షాక్ కలిగే అవకాశం ఉందన్నారు. ఒక వేళ ఏదైనా ప్రమాదాలు సంభంచి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పడు వెంటనే 1912కు డయల్ చేయడం కాని లేదా సమీపంలో ఉన్న విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించడం కాని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో, మైదానల్లో మాత్రమే ఎగురవేయాలన్నారు. కాటన్, నైలాన్, లివెన్‌తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలని, మెటాలికి మాంజాలు వినియోగించవద్దని సూచించారు. పొడివాతావరణలో మాత్రమే పతంగులను ఎగురవేయాలని, తడివాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.
not to fly kites near electricity installations