Wednesday, January 22, 2025

ఇంధన ధరల తగ్గింపుపై చెప్పలేం: బొమ్మై

- Advertisement -
- Advertisement -

Not to mention reduction in fuel prices: Bommai

బెంగళూరు : ఇంధన ధరలలో మరింత తగ్గింపుపై తమ ప్రభుత్వం ఇప్పటికైతే ఏమీ ఆలోచించడం లేదని కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై చెప్పారు. పెట్రోలు డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాలను ఇటీవలే కేంద్రం తగ్గించింది. అయితే రాష్ట్రానికి సంబంధించి మరింతగా ధరల తగ్గింపు విషయంలో ఓ నిర్ణయానికి రాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిగ్గా బేరీజు వేసుకున్న తరువాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన విలేకరులకు తెలిపారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిఖ సమావేశంలో పాల్గొని సిఎం శుక్రవారం స్వరాష్ట్రం చేరారు. ఈ నెల 22న అక్కడికి వెళ్లేముందు ఆయన ఇంధన ధరల తగ్గింపు విషయంలో తమ ప్రభుత్వం పరిశీలన జరుపుతుందని చెప్పారు. ఈ విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా దీనిపై బొమ్మై స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News