Wednesday, January 22, 2025

ధాన్య సేక’రణమే’

- Advertisement -
- Advertisement -

Not to mention resting until center collects grain:KCR

కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే

ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు ముడి ధాన్యాన్ని సేకరించాలి,
దానిని బాయిల్డ్ చేసుకుంటారో, నేరుగా మిల్లాడించుకుంటారో కేంద్రం ఇష్టం

తెలంగాణ ప్రజలతో కేంద్రం
పెట్టుకోవద్దు నేడు మంత్రులు,
ఎంపిల బృందం కేంద్ర
కలుస్తారు యాసంగి వరి
ధాన్యం మొత్తం సేకరించే వరకూ
విశ్రమించే ప్రసక్తే లేదు
ఆషామాషీగా కాకుండా
కార్యాచరణ మేరకు పోరాటం
చేస్తాం టేఫీగామగ్రామాన
తీర్మానాలు చేసి ప్రధానికి
పంపుతాం : టిఆర్‌ఎస్‌ఎల్‌పి
సమావేశం తర్వాత మీడియాతో
ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం ధాన్యం సేకరణపై అంగీకరించకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్య మ పంథాలో పోరాడుతామని ము ఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపిల బృందం కేంద్ర పీ యూష్‌గోయల్‌ను కలుస్తారని అక్క డ సానుకూల స్పందన రాకుంటే పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. సిఎం కెసిఆర్ అధ్యక్షతన సోమవారం టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో కేంద్రం పెట్టుకోవద్ద ని ఆయన హెచ్చరించారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆషామాషీగా కాకుండా కార్యాచరణ మేరకు పోరాటం ఉంటుందన్నారు. పంచాయతీల తీర్మానాలను కూడా కేంద్రానికి పంపుతామన్నారు.

మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ లు, మార్కెట్ కమిటీ, గ్రామ పంచాయితీల తీర్మానాలను ప్రధానికి పం పుతామని సిఎం పేర్కొన్నారు. పంజాబ్ తరహాలో ధాన్యం సేకరించాలని, రాష్ట్రంలో యాసంగి వరి ధా న్యాన్ని కేంద్రం సేకరించాలని టిఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. పంజాబ్ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానం చేశామని సిఎం పేర్కొన్నారు. రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం సేకరించాలన్నారు. ఎక్కువ పంట వస్తే ప్రాసెస్ చేసి నష్టం వస్తే కేంద్రమే భరించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.‘ఒకే దేశం- ఒకే సేకరణ’ విధానం ఉండాలని, దేశవ్యాప్తంగా ఒకే విధానమైన ధాన్యం సేకరణ విధానం ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ‘వన్ నేషన్ -వన్ రేషన్’ అని చెబుతున్న కేంద్రం ధాన్యం సేకరణలో ‘వన్ నేషన్-వన్ ప్రొక్యూర్‌మెంట్ ’ పద్ధతిని అవలంభించాలని ఆయన స్పష్టం చేశారు. ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో ధాన్యం వస్తుందన్న కెసిఆర్ పంట మార్పిడి కింద దాదాపు 25 లక్షల ఎకరాలు తగ్గిందని ఆయన తెలిపారు. పంజాబ్‌లో ఎలా సేకరిస్తున్నారో అదే నీతిని తెలంగాణలోనూ అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశమంతా ఒకే విధానం

ఆహార ధాన్య సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలి. ఆహార ధాన్య సేకరణలో ‘ఒకే దేశం- ఒకే సేకరణ’ విధానం ఉండాలి. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులు సృష్టించిందన్నారు. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర బియ్యానికి కాదనీ, ధాన్యానికి నిర్ణయిస్తారని సిఎం కెసిఆర్ తెలిపారు. కనీస మద్ధతు ధర ప్రకారమే పంజాబ్‌లో ధాన్యం సేకరిస్తున్నారని, కనీస మద్ధతు ధర ప్రకారమే తెలంగాణ ధాన్యం తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వాలని కేంద్రం చెబుతోందని, ధాన్యం ఇస్తే రా రైస్ చేస్తారా? బాయిల్ రైస్ చేస్తారా? అనేది కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఎంఎస్‌పి నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి అని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మెలికలు పెట్టకూడదని, ఇది రైతుల జీవన్మరణ సమస్యగా చూడాలని సిఎం కెసిఆర్ కేంద్రానికి సూచించారు.

ధాన్యం సేకరణలో కేంద్రం కుంటి సాకులు

ధాన్యం విషయంలో మాత్రం కేంద్రానికి ఒక విధానం లేదని మండిపడ్డారు. పంజాజ్, హర్యానాలో వందశాతం ధాన్యం సేకరిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయరని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. కేంద్రం సహకారం లేకున్నా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో కుంటి సాకులు చెబుతోందన్నారు. సమాజాన్ని విభజించే రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు రూ.11 వేల కోట్లు లేవా ?

బిజెపి పాలనలోనే బ్యాంకుల స్కామ్‌లు పెరిగాయని సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 లక్షల కోట్లు బ్యాంకుల రుణాలను కేంద్రం మాఫీ చేసిందనీ, కానీ, ధాన్యం కొనుగోళ్లకు రూ. 11 వేల కోట్లు లేవా?అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు.ఆహారభద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని కెసిఆర్ విమర్శించారు. కరువు వస్తే ఇండియాకు వారంరోజులు ప్రజలకు అన్నం పెట్టే పరిస్థితి ఏ దేశానికి లేదన్నారు. దేశంలో నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదన్నారు. అయితే డీమానిటైజ్ లేదంటే మానిటైజ్ ఇదీ బిజెపి పరిస్థితి అని సిఎం కెసిఆర్ ఎద్దేవా చేశారు.

బిజెపి ప్రభావం తగ్గుతోంది

దేశంలో బిజెపి ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇందుకు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి సాధించిన ఓట్ల శాతం ఇందుకు నిదర్శమన్నారు. ఓట్లు తగ్గడంతో పాటు సీట్ల సంఖ్య తగ్గాయని అన్నారు. గత ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 312 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం బిజెకి వచ్చిన సంఖ్య 255 అని అన్నారు. 50 సీట్లు ఎందుకు తగ్గాయో బిజెపి ఆలోచించాలన్నారు. అలాగే ఉత్తరాఖండ్‌లో సీట్లు, ఓట్లు తగ్గాయన్నారు. పంజాబ్‌లో అయితే బిజెపిని పూర్తిగా తరిమికొట్టారని సిఎం వ్యాఖ్యానించారు. దిగజారుతున్న బిజెపి పరిస్థితికి ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదన్నారు. దేశం బాగుపడాలంటే బిజెపి గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. యుపిఎ పాలన సరిగా లేదని ప్రజలు బిజెపికి అధికారం ఇచ్చారని, కానీ బిజెపి మరింత అధ్వాన పాలన సాగిస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. ఏ రంగంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ముందస్తు లేదు…..

ముందస్తూ ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సిఎం కెసిఆర్ మరోమారు స్పష్టం చేశారు. తాము ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని కుండబద్దలు కొట్టిన చందంగా చెబుతామన్నారు. అంతే తప్ప రహస్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేనేలేదన్నారు. 2018లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ముందుస్తూ ఎన్నికలకు వెళుతున్నామని చెప్పే ఎన్నికలకు వెళ్లామన్నారు. అప్పట్లో ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తామే (టిఆర్‌ఎస్ ప్రభుత్వం) పూర్తి చేయాలన్న సంకల్పంతో గడవుకుంటే ముందే ఎన్నికలకు వెళ్లామన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ప్రస్తుతం పాలుమూరు రంగారెడ్డితో పలు ఎత్తిపోతల నీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. అందువల్ల ఆరునూరైనా ముందస్తూ ఎన్నికలకు వెళ్లమని సిఎం కెసిఆర్ వెల్లడించారు.

మోడీ పాలన అట్టర్ ప్లాప్

దేశంలో మోడీ పాలన అట్టర్‌ప్లాప్ అయిందని సిఎం కెసిఆర్ దుయ్యబట్టారు. ఈ అన్ని రంగాల్లో చూసినా తిరోగమనమే కనిపిస్తోందని మండిపడ్డారు. ఇందుకు మోడీ అసమర్ధ పాలనే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ ఫైల్స్, పులగమా ఫైల్స్, పాకిస్థాన్ ఫైల్స్ అంటూ ప్రజలను రెచ్చగొట్టడం… ఓట్లు దండుకోవడం తప్ప మోడీ పాలనలో కేంద్రం సాధించింది ఏమీ లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత త్వరగా ఇంటికి పంపించాల్సిందేనని అన్నారు. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వాన్ని తీసుకరావాల్సిందేని అన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా 20 వేల మంది పిల్లలను స్వదేశానికి తీసుకురావడానికి కూడా మోడీ ప్రభుత్వం ఇబ్బందులు పడిందన్నారు. ఫలితంగా విద్యార్థులు పడరాని బాధలు పడ్డారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక వ్యధ అనుభవించారన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మెడికల్ విద్యార్థులను తామే చదివిస్తామని నిండు అసెంబ్లీలో ప్రకటించామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నారు. కేంద్రం నుంచి మాత్రం ఉలుకు,పలుకులేకుండా వ్యవహారించిందన్నారు. మతం పేరుతో విద్వేషాలు సృష్టించడం, సమాజాన్ని విడదీయమే బిజెపి పని అని ఆయన ధ్వజమెత్తారు.

అభివృద్ధి సూచికల్లో మనది చివరిస్థానం

ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదన్నారు. జిడిపిని పెంచింది లేదని సిఎం ఆరోపించారు. దేశ పురోగతి అభివృద్ధి సూచికల్లో భయంకరమైన ఇండెక్స్ ఉన్నాయన్నారు. యూత్ నిరుద్యోగ ఇండెక్స్‌లో భారత దేశం చివరి స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. చివరకు సిరియా దేశం కంటే అధ్వాన్నంగా ఉండండం, బిజెపి అసమర్ధ పాలనకు నిదర్శమని కెసిఆర్ మండిపడ్డారు. అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో దేశంలో తిరోగమనంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను తిప్పికొట్టాలన్నారు. ఇందుకు నిరసనగా కేంద్ర వ్యతిరేక ఉద్యమాలను పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. కేంద్రం చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదని ఆయన మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, కొత్త ఉద్యోగాలు సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలనే మోడీ ప్రభుత్వం ఊడగొడుతోందన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ధర్నా చేస్తామని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.

తమ ఉద్యమం కేవలం ధాన్యం వద్దే ఆగిపోదని రిజర్వేషన్ల వ్యవహారంపై కూడా ఉంటుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం కంటే ఎక్కువ ఉండొద్దని రాజ్యాంగంలో లేదన్నారు. ప్రత్యేక పరిస్థితులు సంభవిస్తే 50 శాతం అధిగమించొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందన్నారు. దీనిపై శాసనసభ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందన్నారు. ఈ తీర్మానంపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై కూడా తీర్మానం చేసి పంపించామని, దాని మీద కూడా అతీగతీ లేదన్నరు. ఇక బిసిల కులగణను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విద్వేషాలు సృష్టించి, ఉద్వేగాలకు లోను చేసి వాటిని రాజకీయంగా ఉపయోగించుకునే దుర్మార్గం దేశంలో నెలకొని ఉందన్నారు. దీని వల్ల దేశ అభివృద్ధి కుంటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News