Monday, December 23, 2024

మరుగుజ్జులతో కాదు.. సమ ఉజ్జీలతోనే పోటీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్‌రెడ్డి

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి

వీరిని మనం నమ్మేదెలా?

రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారు

ఈ ఎన్నికలు పార్టీల మధ్య కానీ వ్యక్తుల మధ్య కాదు

మేం ఎవరికీ బి టీమ్ కాదు..తెలంగాణ ప్రజలకు ఎ టీమ్

మొనగాడు లాంటి కెసిఆర్ ఉండగా ఈ పిచ్చి సన్నాసులు కావాల్నా?

వికారాబాద్ సభలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల్లో రాజ కీయ సముజ్జీలతో పోటీ ఉంటుందని మరుగుజ్జులతో కాదని పు రపాలక, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తేల్చిచెప్పారు. కెసిఆర్ రాజకీయం ముందు వీళ్లు రాజకీయ మరుగుజ్జులని, పిగ్మీలని వీళ్లు పెద్ద సిపాయిలనుకోవటం చూస్తుంటే నవ్వొస్తుం దని కెటిఆర్ ఎద్దేవా చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ తో కలిసి రూ.173 కోట్లతో చేప ట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవా లు చేశారు. ఈ సందర్భంగా కెటి రామారావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారని, కెప్టెన్ అమరీందర్‌సింగ్‌లాంటి నేతే ఈ విషయమై సోని యాకు ఫిర్యాదు కూడా చేశారని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి బిజెపితో చేతులు కలుపడం ఖాయమని  వివరించారు. బిజెపి వాళ్లు నీటివాటా తేల్చరు. కాంగ్రెస్ వాళ్లు కేసులు వేసి ఇబ్బంది పెడుతారని ఆరోపించారు.

ఎప్పుడు డిగ్రీ కళా శాల కోసం యుద్ధం చేసిన వికారాబాద్‌లో మెడికల్ కళాశాల వచ్చిందంటే సిఎం కెసిఆర్ వల్లేనని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో అనునిత్యం ప్రజల మధ్య ఉండి అభివృద్ధికి కృషి చేస్తున్న స్థానిక ఎం ఎల్‌ఎ డాక్టర్ మెతుకు ఆనంద్‌కు మరోసారి గెలిపించాలని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అనంతరం బ్లాక్ గ్రౌండ్‌లో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లా డుతూ వికారాబాద్‌లో చదువుకున్న వ్యక్తి ఎ ల్లప్పుడూ ప్రజల్లో ఉండి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి డాక్టర్ ఆనంద్ అని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అభివృ ద్ధి చేస్తుందో ఆ పార్టీకే పట్టం కట్టాలని పిలుపు నిచ్చారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా బిజెపి, కాంగ్రెస్ నా యకులు గ్రామాలకు వ చ్చి అది చేస్తా ఇది చేస్తామని ప్రగాల్భాలు చెప్తారని అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉం డాలన్నారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎలాంటి అభివృద్ధి చేయ నివారు ఇప్పుడు చేస్తామంటే నమ్ముదామా అని ప్రశ్నించారు. భూమి పుట్టినప్పుడు పుట్టి న నాయకులు కాంగ్రెస్ వారని ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ నా యకులు ప్రజలను కోరు తున్నారని ఇప్పటివరకు 11సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నించారు.

కర్ణాటక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నామని చెప్తున్న నాయకులు ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమలు చేయలేద ని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీ నామాలు చేయమంటే పారి పోయిన వ్యక్తి కిషన్‌రెడ్డి అని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఇలాంటి నా యకులు రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి మేలు చేస్తారని ప్రశ్నించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చిన సిఎం కెసిఆర్ తెలంగాణలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పుట్టిన బిడ్డ నుండి చనిపోయే వ్యక్తివరకు ఏదో ఒక రూ పంలో పథకాలు అందుతున్నాయన్నారు. దే శంలో అత్యధిక తలసరి ఆదాయం గల రా ష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నదని అన్నారు. కెసిఆర్ పెట్టిన పథకాలు రాష్ట్రంలో చూసి ఒక సంవత్సరం తర్వాత దేశంలోని మిగతా రా ష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని అన్నారు. యా సంగి సీజన్లో రబీ సీజన్‌లో రైతులకు పంట సహాయం కింద రైతుబంధు రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ అని పడుతుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. రైతు చనిపోతే రైతు బీమా కింద ద శదినకర్మ రాకముందే రైతు బీమా డబ్బులు 5 లక్షల రూపాయలు రైతు ఖాతాల్లో పడుతు న్నాయని పేర్కొన్నారు. గత పాలకులు వికా రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మం త్రులుగా ఉండి కూడా సాధించలేనిది ఒక ఎమ్మెల్యేగా ఉండి డాక్టర్ ఆనంద్ వికారాబాద్‌కు మెడికల్ కళాశాల సాధించా రని అన్నారు. గతంలో నేను రాను బిడ్డో స ర్కారు దవాఖానకు అన్న ప్రజలే నేను ప్ర భుత్వాసుపత్రిలోనే కాన్పులు జరుపుకుంటా మని క్యూ కడుతున్నారని అన్నారు. పిల్లలు పుడితే కెసిఆర్ కిట్ అందుతుందని తెలిపారు.

బిఆర్‌స్‌తోనే గుణాత్మక విద్య
రాష్ట్రంలో 1001 గురుకుల పాఠశాలలు నె లకొల్పి విద్యార్థులకు గుణాత్మక విద్యను అం దిస్తున్న ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అ న్నారు. ఒక్క విద్యార్థికి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి చదివిస్తుందన్నారు. 200 పాఠశాలలు ఏర్పాటు చేసి మైనార్టీలకు విద్యాబుద్ధులు నేర్పుతుందని అన్నారు. మ తం పేరిట కొన్ని పార్టీలు రాజకీయం చేస్తు న్నారని అలాంటి పార్టీలకు దూరంగా ఉం డాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం దేవునితోనైనా కొట్లాడి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభలో మాట్లాడిన పసుపు బోర్డు ప్రకటించారు కానీ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు కల్పించలేదని అన్నారు. సిఎం కెసి ఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ని ర్మించి కృష్ణమ్మ నీళ్లతో రైతుల కాళ్ళను కడి గించారని, కరువును తొలగించిందన్నారు. కృష్ణా నీటితో తెలంగాణ పులకించిపోయింద న్నారు. వృద్ధులకు పెద్ద కొడుకుగా నిలిచారని పేదవాడి చేతిలో చేతి కర్రగా కెసిఆర్ మారా రన్నారు. వికారాబాద్ నియోజకవర్గం అభి వృద్ధికి నిధులు అదేవిధంగా ఐటి హబ్, అ నంతగిరి దేవాలయ అభివృద్ధికి నిధులు అడిగారని తప్పకుండా ఆనంద్ గెలిపిస్తే త ప్పకుండా అభివృద్ధికి భారీగా కేటాయిస్తా మని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News