Friday, November 15, 2024

తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు..

- Advertisement -
- Advertisement -

ఎపి, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 4వ తేదీన ఓటు‌కు నోటు కేసు విచారణ జరుగనుంది. 2017లో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆయన..  తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు.

ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు తీసుకున్నట్లు అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టు ఓటుకు నోటు వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం వద్దకు చేరుకున్న ఓటుకు నోటు కేసు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News